కోదాడ,డిసెంబర్ 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తరపున మన కోదాడ నియోజకవర్గములో నూతనంగా గెలుపొందిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి వెంటనే మన కోదాడ పట్టణమునకు సమీపములోనున్న తమ్మరబండ పాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు జరిపించినారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికలలో నా గెలుపునకు శ్రీనివాసుని కరుణాకటాక్ష వీక్షణములు కారణమని,ప్రజల విశ్వాసమే కారణమని అన్నారు. కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుండి 2024 జనవరి 14 వరకు నిర్వహింపబోవు తిరుప్పావై ఉత్సవ సంబంధమైన ఫ్లెక్సీని ఆవిష్కరించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో దేవాలయ అర్చకులు,చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,స్థానాచార్యులు అర్చక భాగస్వామి ముడుంబై లక్ష్మణాచార్యులు,నల్లాన్ చక్రవర్తుల సుదర్శనా చార్యులు,జగన్నాథాచార్యులు,రంగాచార్యులు,ఆలయ సిబ్బంది,పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.



