కోదాడ,అక్టోబర్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని ద్వారకుంట,నల్లబండగూడెం,రెడ్లకుంట,కూచిపూడి,కాపుగల్లు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేసిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏ నాయకుడు అందించని విధంగా సర్వమతాలను గౌరవిస్తూ సబ్బండ వర్గాలకు పండగ కావాలని తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను తోబుట్టువుగా భావించి దసరా కానుకగా బతుకమ్మ చీరె సారె తో గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక నాయకుడు మన సీఎం కేసీఆర్.అందరూ పువ్వులతో భగవంతుడికి పూజలు చేస్తే మనం మాత్రం ఆ పువ్వులకే పూజలు చేస్తాం అంత గొప్ప సాంప్రదాయం మన తెలంగాణ సొంతం. ఈ సందర్భంగా మహిళలందరినీ తన తోబుట్టువులుగా భావించి చీరె సారెతో గౌరవించి మనల్ని గుర్తించి గౌరవిస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,అధినేత సీఎం కేసీఆర్ కి,నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి అండగా ఉండాలని వారికి నిండు మనసుతో దీవెనలు అందించాలని సబ్బండ వర్గాల అభ్యున్నతి ద్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వానికి నాయకుడికి అండగా నిలవాలని తిరిగి మరలా వారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలతో శుభం కలగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లెల రాణి,ఎంపీడీవో విజయ శ్రీ, సర్పంచులు శెట్టి సురేష్ నాయుడు,సాధినేని లీలా అప్పారావు,పిఎసిఎస్ చైర్మన్లు ముత్తవరపు రమేష్, నంబూరి సూర్యం,గ్రామశాఖ అధ్యక్షులు దాసరి వీరబాబు,మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జిల్లా బోసుబాబు,గద్దె నరేందర్, బూరెల కరుణాకర్, రాజమల్లు, పాలడుగు నాగరాజు, భీమాల బ్రహ్మం,వార్డు సభ్యులు కొండా సైదులు, వీరబాబు, రామనాధం, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి,దేవమని, పంచాయతీ కార్యదర్శులు నాగలక్ష్మి,వెంకట నారాయణ,జీవిత,నాగలక్ష్మి,పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.
RELATED ARTICLES



