బతుకు నిచ్చే తల్లి బతుకమ్మ….
:పూలనే దేవతలుగా కొలిచే పండుగ బతుకమ్మ…
:బతుకమ్మ ఆటపాట తెలంగాణ సంస్కృతి…
:మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): బతుకు నిచ్చే తల్లి బతుకమ్మ పండుగ అని కోదాడ మాజీ సర్పంచి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో తొలిరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగలో భాగంగా బతుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆట.. పాట ప్రారంభించారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. పట్టణ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవత గా భావించి కొలిచే పండుగ బతుకమ్మ అన్నారు. కాగా రంగు రంగుల పూలతో బతుకమ్మలు ముస్తాబు చేసి గోపి రెడ్డి నగర్ మహిళ లు పెద్ద సంఖ్యలో ఆటపాట నిర్వహించారు.



