బరాకత్ గూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి: నందమూరి ఫ్యాన్స్
Mbmtelugunews//కోదాడ, జనవరి 16( ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామ సర్పంచ్ గాఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్ల గురవయ్యని తొగర్రాయి నందమూరి ఫ్యాన్స్ మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి అభినందనలు తెలియచేసి వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మి నమ్మకంతో ఓట్లు వేసినందుకు గ్రామాన్ని అన్ని గ్రామాల కన్నా అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దూపాటి సతీష్ కుమార్, పోతురాజు గోపికృష్ణ, పోటు శ్రీనివాస్, అమరబోయిన నాగేశ్వరావు,
కంపసాటి వినోద్ తదితరులు పాల్గొన్నారు.



