Tuesday, December 23, 2025
[t4b-ticker]

బల్గూరి స్నేహ దుర్గయ్య గెలిపుకై గ్రామములో భారీ ర్యాలీ

బల్గూరి స్నేహ దుర్గము గెలిపుకై గ్రామములో భారీ ర్యాలీ

:బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విరమించుకొని సంపూర్ణ మద్దతు.

:బిఆర్ఎస్ మద్దతుతో ఫుట్ బాల్ కు పెరిగిన బలం.

:ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి బల్గూరి స్నేహను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్) : మండల పరిధిలోని గణపవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్య గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించేందుకు శుక్రవారం గ్రామములో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పలు వార్డులలో వార్డు మెంబర్లుతో కలసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ గణపవరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి శుక్రవారం ఎన్నికల బరిలో నుంచి విరమించుకొని తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆమె తెలిపారు.

ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నా వెంట నడుస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యలను ఎజెండాగా తీసుకొని గ్రామ పెద్దలతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో యువత, గ్రామ పెద్దలు, ప్రజలలో మంచి స్పందన వస్తుందని తెలిపారు. నన్ను గెలిపిస్తే గణపవరం గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రతి ఇంటిలో అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గ్రామములో నూటికి నూరు శాతం అక్షరాస్యతకు సాధించడమే నా మొదటి ప్రాధాన్యత అన్నారు. ముఖ్యంగా గ్రామములో ప్రధాన సమస్యలు ముస్లిం బజార్ నుంచి చెరువు కట్ట వైపు డబల్ లైన్, బ్రిడ్జి, నాయుళ్ల బజార్ నుంచి చెరువు కట్ట పై కొత్త బ్రిడ్జి, మన చెరువును మినీ ట్యాంక్ బండ గా అభివృద్ధి చేస్తానని, సొసైటీ ఆఫీస్ నుంచి చాకలి బజారు మీదుగా కూచిపూడి వరకు రోడ్డు, కాల్వకట్టల పునర్ధరణ, నీటిపారుదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ పొట్ట విజయ్ కిరణ్, బొర్రా మధు, కుంటిగుర్ల నాగభూషణం, జాబిశెట్టి చంద్రమౌళి, వట్టికుట్టి వెంకటేశ్వరులు, బల్గూరి రోశయ్య, బండి చిన్న కోటయ్య, వి రామకృష్ణ, టీ ప్రసాద్, అమరబోయిన లక్ష్మయ్య యాదవ్, చామకూరి గురువయ్య, సానికొమ్ము తరుణ్ రెడ్డి, కొండా ధనమూర్తి, గడ్డం రామిరెడ్డి కాసాని శ్రీను ఏ లక్ష్మయ్య గాయం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular