బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోదాడలో ఉచిత వైద్య శిబిరం
వైద్య శిబిరం ఏర్పాట్లను పరిశీలించిన డిఎంహెచ్ఓ కోటచలం
Mbmtelugunews//కోదాడ,మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ నాయక్ తెలిపారు.కాగా వైద్య శిబిరం ఏర్పాట్లను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటచలం పరిశీలించారు.

గర్భాశయం,బ్రెస్ట్,లంగ్స్,జీర్ణాశయం సంబంధిత అవయవాలకు సోకే క్యాన్సర్ కు సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోరి, డాక్టర్లు,శ్రీరంగం లక్ష్మణ్, వైష్ణవి,హెడ్ నర్స్ మంగమ్మ ఉన్నారు.