బాగా కష్టపడి చదివితేనే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు:నీటిపారుదల శాఖ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సత్యనారాయణ
కోదాడ,మే 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బాగా కష్టపడి చదివితేనే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలిగి చదువు చెప్పిన గురువులకు పెంచిన తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలరని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సత్యనారాయణ అన్నారు.అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (అస్క్),కోదాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ముగింపు సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)సత్యనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఈ దశలోనే ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని బాగా కష్టపడి చదివితేనే ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరగలుగుతారని అన్నారు.అస్క్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి గత 12 సంవత్సరాలుగా బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ద్వారా విద్యను అందించడం చాలా అభినందించదగ్గ విషయమని తెలిపారు.ఆస్క్ అధ్యక్షులు బల్గూరి స్నేహదుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్క్ వ్యవస్థాపకులు బల్గూరి దుర్గయ్య (ఏఈ),ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి,బొడ్డు హుస్సేన్,పిడమర్తి వెంకటేశ్వర్లు,నందిపాటి సైదులు,అమరబోయిన వెంకటరత్నం,కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చారావు,చెరుకుపల్లి కిరణ్,కే కన్నయ్య,షరీఫ్,నటరాజ్,త్రివేణి,కే శ్రీకాంత్,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



