Friday, February 20, 2026
[t4b-ticker]

బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలు ప్రారంభము

బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలు ప్రారంభము

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 19( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ప్రార్ధన ఏసు ప్రభువు వారు సమస్త మానవాళి కోసం కలవరి సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసారని అనేకులు పెట్టిన నిందలు అవమానాలు భరించి మానవాళి పాపము కొరకు భారాన్ని మోసాడని ఆయన కొనియాడారు. ఉపవాస ప్రార్థనలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాల నుండి తనకు కావలసిన కోరికలను ప్రభువుకు మొర పెట్టినప్పుడు ఆయన తన వారి కోరికలు నిర్వహిస్తారని దూరమైన విశ్వాసం క్రిస్టియన్ ల విశ్వాసం ఏసుప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున మరణించి మూడవ దినమున ఆదివారం నా తిరిగి లేస్తాడని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది ఇది నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతారని ఆయన అన్నారు. మానవుడు ఏ పాపంలో ఉన్నాడో తన మనస్సాక్షికి తెలుసునని ఆ మనస్సాక్షి శుద్ధి చేసుకునేలా పవిత్రమైన బంధం ఏర్పడి శరీరక మానసిక రుగ్మతలు నుండి విడుదల ఇస్తాడని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ క్రిష్టియన్ కోఆప్షన్ సభ్యురాలు జానకి, పిఆర్టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బొల్లికొండ కోటయ్య, జగ్గు నాయక్, హెడ్ కానిస్టేబుల్ జాన్, శారా, రాంబాబు, మోజెస్, ఎనోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular