బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మదర్స్ డే వేడుకలు
కోదాడ,మే 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయానగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో మదర్స్ డేను యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ దొరకదని, తల్లి భర్తకు విధేయురాలుగా ఉండే కుటుంబ అభివృద్ధికి పాటుపడుతుందని,తల్లి పిల్లలకు ఒక టీచర్ అని,తల్లి కుటుంబం అంతటికి శ్రమపడి పని చేస్తుందని,తాను చేసిన కష్టమును ద్రవ్యమును దాచిపెట్టి పిల్లలకు కావలసినవి ఇస్తుందని,పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటుందని వివరించారు.

అనంతరం వచ్చిన సీనియర్ సిటిజన్స్ తో అందరూ ఆనందాన్ని పంచుకున్నారు మదర్స్ డే కేక్ కట్ చేసిఅందరికీ పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య,జ్యోతి,సీత,సువార్త,అప్పిరెడ్డి,నాగమణి,అరుణ,సునీత తదితరులు పాల్గొన్నారు.



