బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని నయానగర్ లో గల బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి లు హాజరై కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ క్రీస్తు చూపిన బోధనలు క్షమాగుణం,శాంతి,కరుణ,సహనం,ప్రేమ,సదా అనుసరణీయమని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు.

తెల్లవారుజామునే పెద్ద ఎత్తున తరలివచ్చిన దైవజనుల మధ్య ఏసుక్రీస్తు జననం పై నిర్వహించిన నాటికలు, నృత్యాలు,పాటలు పలువురిని ఆకట్టుకున్న.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్ లెంకల రమాదేవి నిరంజన్ రెడ్డి,మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య,జిల్లా గౌరవ అధ్యక్షులు బొల్లి కొండ కోటయ్య,గిరిజన ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్,హెడ్ కానిస్టేబుల్ జాన్,సోంపంగు నాగేశ్వరరావు,రామకృష్ణ,విజయానంద్,మోజెస్,రాంబాబు,ద్రాక్షావల్లి,సునీత తదితరులు పాల్గొన్నారు.