బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో యూత్ మెగా ఎవర్నెస్ ప్రోగ్రాం బ్రోచర్ విడుదల
Mbmtelugunews//కోదాడ,మే 18 (ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్,యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు యేసయ్య ఆధ్వర్యంలో ఈనెల 21 తారీకు బుధవారం రోజు స్టూడెంట్స్ కొరకు మెగా అవగాహన సదస్సు బ్రోచర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యేసయ్య మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని వారు కళాశాలలో ప్రవేశించక ముందే డ్రగ్స్, మద్యం,సోషల్ మీడియా చెడుసావాసాల ప్రభావం ఎంత మాత్రము యువత మీద పడకుండా కళాశాలలో ప్రవేశించే ముందే ఆదిలోనే అవగాహన కల్పించాలని సదుద్దేశంతో
నూతనంగా కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ మెగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల ఎంతోమంది యువతీ యువకులు బలపడటానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని అన్నారు.

అనేకమంది యువకులలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం.ఇట్టి కార్యా క్రమానికి అనుభవం కల్గిన మోటివేషనల్ వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు.బ్రోచర్ విడుదల కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి ఏసయ్య,పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొలికొండ కోటయ్య,గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు జగ్గు నాయక్,హెడ్ కానిస్టేబుల్ జాన్,శారా,మేరమ్మ,జ్యోతి,విజయానంద్,రాంబాబు,మోజస్ తదితర సంఘ యూత్ సభ్యులు పాల్గొన్నారు.