బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
Mbmtelugunews//కోదాడ, జనవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గత సంవత్సరం అంతా దేవాది దేవుడు తన చల్లని రెక్కల కింద కాపాడి ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశింప చేసినందుకు కృతజ్ఞతగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరిగించారు. దేశము తెలంగాణ రాష్ట్రం నాయకులు, అధికారులు, వైద్యులు, కార్మికులు, సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ప్రజల వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ క్రిస్టియన్ సభ్యులు వంటిపాక జానకి యేసయ్య, బొల్లికొండ కోటయ్య, బానోతు జగ్గు నాయక్, హెడ్ కానిస్టేబుల్ జాను, రాంబాబు, కోటేశ్వరమ్మ, ప్రవళిక, స్రవంతి, శార, కవిత, కోటేశ్వరి, సుధా తదితరులు పాల్గొన్నారు.



