కోదాడ,ఏప్రిల్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని చేపల మార్కెట్ చౌరస్తా నందు బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని పురస్కరించుకొని జయంతి ఉత్సవాలు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజయ్య యాదవ్ అన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాబుజీగా ప్రఖ్యాతిగాంచిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం ఏప్రిల్ 5వ తేదీ ఆయన జయంతిని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని అన్నారు.ఒక సామాన్య రైతు కుటుంబంలో బాబూ జగ్జీవన్ రామ్ చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించాడు.50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు బోలిశెట్టి కృష్ణయ్య బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ప్రతి ఒక్కరు నిర్వహించాలి:డాక్టర్ అంజి యాదవ్
RELATED ARTICLES



