Saturday, April 4, 2026
[t4b-ticker]

బాలల చట్టాలపై అవగాహన..

బాలల చట్టాలపై అవగాహన..

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు…

:అనాధ బాలలకు
మిషన్ వాత్సల్య పథకం.

:జి విద్యాసాగర్

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలో పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ”ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన” బాలల చట్టాలపై అవగాహన” కార్యక్రమంలో బాలల పరిరక్షణ, మహిళా -శిశు సంక్షేమ శాఖ సూర్యాపేట జిల్లా అధికారి
జి. విద్యాసాగర్, పాల్గొని మాట్లాడినారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు, బాల్యవివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు నేరం, మిషన్ వాత్సల్య పథకం ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన బాలలకు పునరావాసం ఏర్పాటు చేయడం, అనాధ బాలలకు స్పాన్సర్ షిప్ కార్యక్రమాలు నిర్వహించడం, చట్టబద్ధమైన దత్తత కార్యక్రమాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినారు. బాలల చట్టాలు పరిరక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 100, 108, 1098 ఉపయోగించుకోవాలని తెలిపినారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో మానవ అభ్యుదయ అధ్యయన సంస్థ ఆచార్య రమేష్ గురూజీ పాల్గొని విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞాపకశక్తి చదువుపై శ్రద్ధ సృజనాత్మక శక్తి పెరిగే ఆలోచన విధానాలను వివరించారు. చదువుతోపాటు సంస్కారం ముఖ్యమని, అమ్మ నాన్న గురువులు అతిథులను గౌరవించడం గురించి విద్యార్థులకు తెలియజేసినారు. మానవతా విలువలు, జీవిత సత్యాలు, సేవా నాయకత్వ లక్షణాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయకుండా 100% పూర్తిచేసే అలవాటును విద్యార్థులు సాధన చేయాలని తెలిపారు. కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular