బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమం.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు మంచినీటి సౌకర్యం ప్లాంట్ ను ప్రారంభించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థుల యొక్క సమస్యలను విద్యాబోధన ఎలా జరుగుతుంది అనే అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.నా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా స్వీకరిస్తానని సమస్యల పరిష్కరించి రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని విద్యార్థులకు తెలియజేశారు.మూడు ఎకరాల విస్తీర్ణం లో గల ఇంత పెద్ద ప్రభుత్వ పాఠశాల మన కోదాడలో ఉండటం మన అదృష్టం అని అన్నారు.విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ పై దృష్టి సారించి మీరు మీ సార్ చెప్పినప్పుడే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు మీ బంధువులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకోవాలని దాని వలన రేపు మీరు ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడటానికి కానీ ఇతర దేశానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీషు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఎడ్యుకేషన్ విషయంలో ముందుకు వస్తున్న దాతలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎంఈఓ సలీం షరీఫ్,ఇంచార్జ్ హెడ్మాస్టర్ మార్కండేయ,కౌన్సిలర్ గంధం యాదగిరి,బాగ్దాద్ తదితరులు పాల్గొన్నారు.