బాల ఉగ్ర నరసింహ స్వామి కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా
ఉండాలి: శ్రీనివాసరావు
:స్వామివారిసన్నిధిలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం
Mbmtelugunews//కోదాడ, మే 09(ప్రతినిది మాతంగి సురేష్):మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో వేంచేసియున్న బాల ఉగ్ర నరసింహ స్వామి కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు అన్నారు.తన కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించిన సందర్భంగా శుక్రవారం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో పదివేల మంది భక్తులకు శ్రీనివాసరావు కృపామణి దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో తన కూతురు అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసుకుని మంచి ఉద్యోగాన్ని సాధించిందని ఆయన కృపా కటాక్షాలు దీవెనలు తమ కుటుంబం కోదాడ ప్రాంత ప్రజలు మీద ఉండాలని తెలిపారు.ఈ అన్నదానకార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నలజాల జగన్నాథం,జవాజీ నాగేశ్వరరావు. రావుల వెంకటేశ్వర్లు,నలజాల కొండలు,కోదాడ మాజీ వార్డు కౌన్సిలర్ కర్రీ శివా సుబ్బారావు,సాతులూరి భాస్కరరావు,సుదర్శన్ రావు,భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు కృపామణి దంపతులను ఘనంగా శాలువులతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.