బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోరుతూ ప్రచారం.
బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం:కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి….
కోదాడ,మే 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి శనివారం మండల పరిధిలోని దొరకుంట,నల్లబండగూడెం,చిమిర్యాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్కటిని నెరవేర్చలేదు అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు ఆటకేక్కాయని విమర్శించారు.ప్రశ్నించే గొంతుక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్,గంటా శ్రీనివాసరావు,రమేష్,వీరబాబు,కోటేశ్వరరావు,వెంకటరెడ్డి,విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.



