Thursday, December 25, 2025
[t4b-ticker]

బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వలసలు:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,ఆగష్టు 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నందిపాటి వెంకయ్య తో పాటు 30 కుటుంబాలు,అనంతగిరి మండల కేంద్రానికి చెందిన చెందిన 50మంది ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని,దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని అన్నారు.దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కులేని పార్టీగా మారింది.తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులు ఉండేవి.నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.నేటికీ బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజల ఆకలి చావులు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు.యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు.నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలన్వే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు.దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు.పార్టీలో చేరిన వారు కొప్పుల వీరయ్య,పిడమర్తి శీను,షేక్ సైదులు,బండి గోపి,చింతల మహేందర్, షేక్ కమల్, షేక్ చిన్న కమాల్,ఫిరంబి,50 కుటుంబాలు తదితరులు జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో మునగాల మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్,అనంతగిరి సర్పంచ్ వేనెపల్లి వెంకటయ్య,మాజీ సర్పంచ్ వీరయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు చార్లెస్,నాయకులు సుందర్ రావు,వల్లపు శీను,నాగేశ్వరరావు,నరసింహులగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు మీరా,సర్పంచ్ మల్సూర్,నాయకులు కోటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular