కోదాడ,ఫిబ్రవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బహుజన సమాజ్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,కోదాడ నియోజకవర్గం ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్ రాజీనామా చేయడం జరిగింది.సోమవారం కోదాడ పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత 2020 డిసెంబర్ 20న రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగిందని అన్నారు.గత రెండున్నర సంవత్సరాలు గా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ,ప్రజల పక్షాన పోరాటం చేయడం జరిగిందని,గత ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేయడనికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి,రాష్ట్ర కార్యవర్గనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.అదేవిధంగా అన్ని విధాలుగా సహకరించిన జిల్లా,నియోజకవర్గం,మండలం,గ్రామ నాయకులుకు,కార్యకర్తలుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు సోమవారం పార్టీకి,పదవులకు రాజీనామా చేయడం జరిగిందని అన్నారు.నాతోపాటు నా సహచర నాయకులు జిల్లా ఇసి మెంబర్ అప్పల సందీప్ గౌడ్,నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి యరసాని కృష్ణ యాదవ్,ఉపాధ్యక్షులు మదన్ గౌడ్,పట్టణ కార్యదర్షి షేక్ అజర్ బాబా,కోదాడ మండలం అధ్యక్షులు మేరె యల్లారావు, మోతే మండలం అధ్యక్షులు అండెం గోపి గౌడ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల గోపినాథ్ తదితరులు రాజీనామా చేసారన్నారు.తదుపరి భవిష్యత్తు కార్యాచరణను,సహచర నాయకులు,కార్యకర్తలతోటి చర్చించి తెలియజేస్తామన్నారు.
బిఎస్పి పార్టీకి రాజీనామా చేసిన పిల్లుట్ల శ్రీనివాస్
RELATED ARTICLES



