కోదాడ,ఆగష్టు 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన బిడ్డ కొదమ సింహం,గోల్కొండ కోటను ఏలిన తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతినీ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి మరియు ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కిలాషాపురం కోట నుంచీ గోల్కొండ కోట వరకు బహుజన వీరులను కూడగట్టుకొని గొరిల్లా యుద్ద వ్యూహంతో మొగల్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించి గొరిల్లా యుద్దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి శివాజీ మహారాజ్ &సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ బహుజనులను ఏకం చేసి భూస్వామ్య వ్యవస్థకు దోపిడీ దారుల ఆగడాలకు వ్యతరేకంగా అతి తక్కువ కాలములో ఏక్కువ సైన్యాన్ని కూడకట్టి గోల్కొండకోటను ఏలిన విప్లవ సింహం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్దార్అనే_గొప్పగా పిలుపించుకుని పరదేసీయుల మనసుని గెలుచుకున్నాడు. బహుజనుడు కావడమే తన చరిత్ర ను ఈరోజు వెలుగులోకి తీసుకరాకపోవడం ఒక ప్రదాన కారణము కావొచ్చు.అందుకే ఆయనకు సంబందించిన చరిత్ర ద్వారా ఆయనను సమాజానికి పరిచయం చెయ్యలేదు,ఆయన చరిత్రను పరిచయం చేస్తే ఎక్కడ బహుజనులు రాజ్యమేలుతరో అనే భయము ఆనాటి అగ్రవర్ణాల ఏత్తుగడకు ఇదొక నిదర్శనమని చెప్పొచ్చు.సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ ఆయన వీరోచిత పోరాటాన్ని మనం అలవర్చుకోవాలని దానికోసం యువత ముందుకు వచ్చి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసి మేంబర్ కొండా భీమయ్య గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు పిడమర్తి దశరథ,జిల్లా ఈసి మెంబర్ మాతంగి ఏసుబబు,జిల్లా కార్యదర్శి సాలె చంటి,నియోజకవర్గ అద్యక్షుడు కంభంపాటి శ్రావణ కుమార్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు చింతాల రమేష్,ప్రధాకార్యదర్శి యరసాని కృష్ణ యాదవ్,కార్యదర్శి చిన్నం ఇర్మీయ,కంపాటి వీరస్వామి,కలకొండ భరత్,చిలుకూరు మండల అధ్యక్షులు కొండా ఉపేందర్ గౌడ్,అనంతగిరి మండల అధ్యక్షుడు నూకల గోపాలస్వామి యాదవ్,కోదాడ మండల అద్యక్షుడు మేరే ఎల్లయ్య,అనంతగిరి మండల ఉపాధ్యక్షుడు కరిష ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
బిఎస్పి పార్టీ కార్యాలయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
RELATED ARTICLES



