కోదాడ,ఆగష్టు 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మోతె మండలం సిరికొండ గ్రామంలో బీఎస్పీ పార్టీ గద్దెను అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూలగొట్టడం జరిగింది.కావున బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి &ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనన్న ఆదేశాల మేరకు మోతే మండల ఇంఛార్జి కాంపాటి వీరాస్వామి,మహిళా కొ కన్వినర్ వెంపటి.నాగమణి,కోదాడ నియోజకవర్గ కార్యదర్శి చిన్నం ఇర్మియా,స్థానిక బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూలగొట్టిన దిమ్మె వద్ద ధర్నా చేసి కూలగొట్టిన అధికార పార్టీ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా పిటీషన్ ఇవ్వడం జరిగింది.బిఎస్పి పార్టీ దిమ్మెను కూలగొట్టడం పార్టీ నాయకులందరం తీవ్రంగా ఖండిస్తూ బిఎస్పి పార్టీ ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నరని ఇప్పటికైనా బహుజనులు ఏకం కావాలని,రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ విజయాన్ని ఎవరు ఆపలేరని ఎన్ని దాడులు చేసిన చివరకు విజయం మాదే అని అన్నారు.
బిఎస్పి పార్టీ దిమ్మెను కూల కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES



