యాదాద్రి భువనగిరి జిల్లా; తుంగతుర్తి నియోజక వర్గం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) బిక్కేరు వాగులో ఇసుక మాఫియా పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఉక్కుపాదం. ఎమ్మెల్యే సామేల్ వెంట ఇసుక దోపిడీ పై దండెత్తిన రైతులు, ప్రజలు. బిక్కేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా కోసం దోపిడీ దొంగలు సుమారు 10 కిలోమీటర్ల మేర వాగు మధ్య నుంచి 10 మీటర్ల ఎత్తులో యేనె గుండ్ల రాళ్ల ఎర్రమట్టి పోసి డబుల్ రోడ్డు వేసిన వైనం. వాగు మధ్య లో లారీల రాకపోకల కోసం రింగ్ రోడ్డు తరహా లో రోడ్డు. సుమారు రూ.5 కోట్లకు పైగా వెచ్చించి ఈ రోడ్డు వేశారని చెబుతున్న రైతులు. ఇక్కడ 50 ఫీట్ల లోతు వరకు ఉన్న వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి స్కెచ్ వేసిన ఇసుక దొంగలు. రోడ్డు వేసేందుకు, ఇసుక తరలింపుకు భారీ యంత్రాలు ఉపయోగించి ఇసుకాసులు. గత పాలకుల ఇసుక మాఫియా మాయా సామ్రాజ్యాన్ని బహిర్గతం చేసిన ఎమ్మెల్యే సామేల్. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జేసీబీ లతో రోడ్లకు గండ్లు పెట్టించిన ఎమ్మెల్యే సామేల్. ఎమ్మెల్యే వార్నింగ్ తో వాగులోని భారీ యంత్రాలను వాగు బయటకు తరలించిన ఇసుక దొంగలు. వాగులో రోడ్డు కోసం భారీ ఎత్తున పోసిన మట్టిని రైతులు వ్యవసాయ బావుల వద్ద బాటలకు తరలించుకోవాలని చెప్పిన ఎమ్మెల్యే సామేల్. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసిన ఎమ్మెల్యే సామేల్ కు రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
బిక్కేరు వాగులో గత ప్రభుత్వం వేసిన రోడ్లు తవ్వి చెడగొట్టిస్తున్న ఎమ్మెల్యే సామెలు.
RELATED ARTICLES