Friday, December 26, 2025
[t4b-ticker]

బిజెపి అధికారంలోకి వస్తే….రాజ్యాంగానికి పెను ప్రమాదం

::10 సంవత్సరాల తెలంగాణకు మోడీ చేసింది శూన్యం.

:కాంగ్రెస్ తీసుకొచ్చిన ఐటి,ఐఆర్ రద్దు చేసింది నిజం కాదా.

:హైదరాబాద్ ఆర్ఐఆర్ రెండు కోట్లు ఉద్యోగ అవకాశాలు యువత కోల్పోయింది.

:టిఆర్ఎస్ మునిగిపోయిన పడవ.

:హస్తం పార్టీ అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాలు

:రైతులను నడ్డి విరిచి అధికంగా నష్టపరిచింది మోడీ ప్రభుత్వం

:ప్రతిపక్షం పాలక పక్షంలో ఉన్న కోదాడ,హుజూర్ నగర్ ప్రజలకు 10 సంవత్సరాలు సేవ చేశా.

:ఐదు సంవత్సరాలలో ఈ రెండు నియోజకవర్గాల రూపురేఖలు మార్చుట

:పార్లమెంట్ సన్నాక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ,ఏప్రిల్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో బాగంగా కోదాడ డేగ బాబు ఫంక్షన్ హాల్ లో నల్లగొండ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరి రఘువీర్ రెడ్డి,కుందూరి జానారెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి రాష్ట్రం లోనే భారీ మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.

పార్లమెంట్లో రఘువీరారెడ్డి గళం ఇప్పాలంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.భారతదేశంలోనే నల్లగొండ పార్లమెంటు భారీ మెజార్టీ తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బిజెపి,బీఆర్ఎస్ తప్ప అన్ని కుల సంఘాలు,విద్యార్థి సంఘాలు,మత సంఘాలు,ప్రజాసంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని అన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేయని బిజెపి ఓట్లు అడిగే అర్హత లేదు అని అన్నారు.ఎంఎస్పి కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తానని బిజెపి విఫలం చెందింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాననీ మాట తప్పిన బిజెపి ప్రభుత్వం. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని రాహుల్ గాంధీ భర్తీ చేస్తారని అన్నారు.అనంతరం ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకున్నామని అన్నారు. నన్ను ఎంపీగా గెలిపించినట్టయితే పార్లమెంట్ లో మన రాష్ట్రం కోసం మన జిల్లా కోసం మన ప్రాంతం కోసం పోరాడుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే వేంపల్లి చందర్రావు, మాజీ డిసిసిబి చైర్మన్ చెవిటి వెంకన్న, కోదాడ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,ముత్తువరపు పాండురంగారావు,పార సీతయ, జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు,డేగ బాబు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,అల్తాఫ్ హుస్సేన్ప్,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,ఎంపీపీలు ఎలక బిందు నరేందర్ రెడ్డి,ఆశ శ్రీకాంత్ రెడ్డి,శంకర్ నాయక్, సీపీఐ నాయకులు గన్న చంద్రశేఖర్, సిపిఎం నాయకులు వెంకట్ రెడ్డి, మాతంగి బసవయ్య,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular