కోదాడ,మార్చ్ 24 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ ఆదివారం హైదరాబాదులోనే బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకొని బీజేపీలో చేరినానని అంజి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని ఈ సందర్భంగా తెలిపారు. కోదాడ ప్రాంతానికి ఇంకా ఎంతో చేయాలని ఉద్దేశంతో జాతీయ పార్టీలో చేరినట్లు తెలిపారు.కోదాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభివృద్ధి తో పాటు ప్రజలకు తోడుగా ఉంటూ వారి యొక్క సమస్యలపై అధికార పార్టీ తో పోరాటం చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట జాయిన్ అయినవారు ఎం వెంకటేష్ బాబు,ఎన్ వికాస్ రెడ్డి,రాజశేఖర్ నాయుడు,కే శ్రీను,ఉపేందర్,కతిమాల వెంకన్న,ఏ కిషన్ నాయక్,కే శ్రీను,ఎన్ హరీష్,వాడకొప్పుల నవీన్ తదితరులు పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు భాగ్యరెడ్డి,కనగాల నారాయణ,వి శ్రీనివాసరావు,పిచ్చయ్య,బి శ్రీనివాసరావు,రాధాకృష్ణ,సతీష్,సత్యనారాయణ,దాసు తదితరులు ఉన్నారు.



