బిజెపి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 5 (ప్రతినిధి మాతంగి సురేష్)భారతీయ జనతా పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీష్ అధ్యక్షతన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బిజెపి రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ నివాసంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి,పార్టీ భవిష్యత్ కార్యక్రమాల గురించి నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట నరసయ్య,వెంకటేశ్వరరెడ్డి,మల్లెబోయినవెంకటేష్ బాబు,సిద్దయ్య,నరసింహారావు,నాగేశ్వరరావు,సైదులు,బిజెపి నాయకులు,బూత్ అధ్యక్షులు తదితరులు, పాల్గొన్నారు.