కోదాడ,ఏప్రిల్ 20(mbmteligunews)ప్రతినిధి మాతంగి సురేష్:మునగాల మండల బిజెపి కార్యకర్తల సమావేశం
మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసినారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా

నల్గొండపార్లమెంటు బిజెపి పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపును కోరుతూ మునగాల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు,కోఆర్డినేటర్లు వీఎల్ఏ 2లు పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు నిధులను కేటాయించిందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావట్లేదని గొప్పలు చెప్పుకోవడం అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో ప్రజల గమనిస్తున్నారు నిధులు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయో ప్రజలకు కూడా తెలుసని అన్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,ప్రచారం గురించి వారికి వివరించినారు.మునగాల బూత్ నెంబర్ 71లో గడపగడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను బడుగు బలహీన వర్గాల వారికి వివరించారు.



