కోదాడ,జూన్ 18 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బిఆర్ఎస్ పార్టీ కలకోవ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఎస్పీ లో చేరిన అనంతు శ్రీనివాస్ గౌడ్ ను బహుజన్ సమాజ్ పార్టీ మునగాల మండల అధ్యక్షులుగా నియమించడం జరిగిందని బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ పిలుట్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ… కోదాడ నియోజకవర్గం లో బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ స్థాయిలో రోజు రోజు కు బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అంటే కేవలం బీఎస్పీ తోనే సాధ్యమవుతుందన్నారు. నూతన అధ్యక్షులు గా ఎన్నికైన అనంతు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…అన్ని రాజకీయ పార్టీలు బిసి,ఎస్సి కులాల ప్రజలను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకొని వదిలేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ బిసి,ఎస్సి లను నాయకుల తయారుచేస్తుందని ఆయన అన్నారు.బహుజన నాయకుల స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ బీఎస్పీ లో చేరాలని ఆయన కోరారు.మండల అధ్యక్షులుగా నన్ను నియమించిన కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ పిలుట్ల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
బీఎస్పీ మునగాల మండల అధ్యక్షుడిగా అనంతు శ్రీనివాస్ గౌడ్ నియామకం
RELATED ARTICLES