బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయాలి:ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్
కోదాడ,మే 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్(టిఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి నేడు దాని గురించి ఊసే లేని విధంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు బీసీ లను బడుగు బలహీన వర్గాలను మోసం చేసే విధంగా ఉన్నదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవుల్లో సామాజిక న్యాయం కొరవడింది పదవుల్లో పెద్ద పీట వేస్తూ ఒకే సామాజిక వర్గానికి అగ్రభోజ్యం కట్టబెట్టిన తీరును గమనిస్తే సామాజిక న్యాయాన్ని ఆదిలోనే హత్యచేసిన వైఖరి కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి పదే పదే ఉపన్యాసాలు ఇస్తున్నా ఇక్కడ తెలంగాణ లో మాత్రం నాయకులు సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి కుటుంబాల పాలన కొనసాగిస్తున్నారు.ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ముందుగా బీసీ నినాదంతో వచ్చి అదే బీసీలను అనగదొక్కటం చాలా దురదృష్టకరమని అన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం లేనిచో బీసీల ఓట్లకు కాంగ్రెస్ పార్టీ దూరమవుతుంది అని హెచ్చరించారు.



