కోదాడ,నవంబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కోమరబండ,ఆకుపాముల,దొరకుంట గ్రామాలలో భారీ చేరికలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ నియోజకవర్గ బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అబ్దుల్ మాలిక్ పాల్గొని పార్టీ కండువకప్పి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత చైతన్య యువజన పార్టీలో రోజు రోజుకీ భారీగా చేరికలు పెరుగుతున్నాయని అన్నారు.భారత చైతన్య యువజన పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విద్య,వైద్యం ఉచితంగా అందిస్తామని అన్నారు రైతులకు వ్యవసాయ పరికరాలను ఉచితంగా అందించి వారు పండించిన వడ్లకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు.పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారికి అండగా అందుబాటులో ఉంటామని అన్నారు.నియోజకవర్గ ప్రజలు చెరుకు రైతు గుర్తు పై ఓటు వేసి భారత చైతన్య యువజన పార్టీ కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ మాలిక్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.పార్టీలో జాయిన్ అయిన వారు,షేక్ నాగుల్ మీరా,షేక్ అమీద్,షేక్ పాషి,షేక్ జానీ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు.
బీసీవై పార్టీలో భారీ చేరికలు
RELATED ARTICLES



