బీసీ కుల గణన బీసీల సంక్షేమం కోసమే.
: బీసీల అభివృద్ధిలో మంత్రి ఉత్తమ్ ది కీలకపాత్ర:కేఎల్ఎన్ ప్రసాద్.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల భారీనీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు. కోదాడలో ఆయన స్వగృహంలో తనకు సంబంధించిన బీసీ కులగణన విషయాలు పొందుపరుస్తూ దేశంలో ఎక్కడలేని విధంగా బీసీ కులగణన చేపట్టిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని భవిష్యత్తులో బీసీల కోసం సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా ఉపయోగపడే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుందని కేఎల్ఎన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.