Friday, July 4, 2025
[t4b-ticker]

బెస్ట్ అవైలబుల్ స్కీం పిల్లలకు పుస్తకాలు, దుస్తులు ఇవ్వాలి

బెస్ట్ అవైలబుల్ స్కీం పిల్లలకు పుస్తకాలు, దుస్తులు ఇవ్వాలి

Mbmtelugunews//కోదాడ,జూన్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):బెస్ట్ అవైలబుల్ స్కీం పిల్లలకు పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సిటీ సెంట్రల్ స్కూల్ యాజమాన్యం పై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గుండెపంగు రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా నిరుపేద ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులకు (బిఏఎస్) బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో అన్ని వసతులు కల్పిస్తూ, డ్రా పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తుందని అన్నారు. ఇలా ఎంపికైన విద్యార్థులను జిల్లాలోని పలు ప్రైవేట్ స్కూల్స్ ద్వారా ఉచితంగా విద్యను అందిస్తుందని దానిలో భాగంగా కోదాడ పట్టణంలోని సిటీ సెంట్రల్, సైదయ్య కాన్సెప్ట్ స్కూల్ నందు గత మూడు సంవత్సరాలుగా విద్యనబ్యసిస్తున్న విద్యార్థులకు స్కూలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న ఇప్పటివరకు పుస్తకాలు ఇవ్వకుండా, బస్సులను పంపించకుండా, భోజనాన్ని పెట్టకుండా, హాస్టల్ వసతి కల్పించకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దీనిపై స్కూలు యాజమాన్యాన్ని వివరణ కోరగా వారు మీ పిల్లలకు గవర్నమెంట్ ద్వారా వచ్చే బిల్లులు ఇంకా రాలేదని, అవి ఆగిపోయాయని దానివల్ల మీకు చదువు చెప్పటం కుదరదని, పుస్తకాలు ఇవ్వడం కుదరదని, హాస్టల్ వసతి కల్పించడం కుదరదని మొండిగా చెప్పడం జరిగిందని అన్నారు. విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తుపై చెలగాటమాడుతున్న విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కి, షెడ్యూల్ తెగల శాఖ మంత్రికి, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి, డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుక్కల కృష్ణ, ఏపూరి బ్రహ్మం, కలకొండ సైదులు, సోమపంగు బాల సైదులు, కందుకూరి సురేష్, రాంపంగు. సైదులు, కల్పన, నిర్మల, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular