బేతవోలు గ్రామంలో గంజాయి కలకలం…
:పల్లెల్లో గుప్పుమంటున్న గంజాయి.. ఐదుగురు నిందితులు అరెస్ట్…
కోదాడ,జులై 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని చిలుకూరు పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.వారి నుంచి 1.080 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండు గోపి ఇంటివద్ద గుండు రాజేష్,బత్తిని వెంకటేష్,కొలిమి శివ,పేరం శ్రీకాంత్ లు గంజాయి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు బుధవారం దాడి చేశారు.ఐదు మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వారి వద్ద నుంచి 1.080 కిలోల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.కోదాడ డిఎస్పి నిర్వహించిన పత్రిక సమావేశంలో కోదాడ రూరల్ సిఐ
జి రజితా రెడ్డి,చిలుకూరు ఎస్సై రాంబాబు,పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్ వీరస్వామి,నగేశ్,వెంకటేశ్వర్లు,తిరుపయ్యలు పాల్గొన్నారు.