కోదాడ,ఆగష్టు 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా నాభిశిల,గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించడం మన తెలంగాణ సాంప్రదాయమని గ్రామాన్ని గ్రామ ప్రజలను పశు పక్షాదులను చల్లగా కాపాడి గ్రామానికి అండగా నిలిచే గ్రామదేవతలకు పూజలు నిర్వహించుకోవడం ఆచారమని ఆ ఆచార వ్యవహారాలకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని సీఎం కేసీఆర్ పాలనలో,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాల్లో ఉండాలని ఆ గ్రామదేవతలను ప్రార్థిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపెదకాపు,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బోనాల పండుగ సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.
RELATED ARTICLES



