బ్యాంకు డేస్ సందర్భంగా గొండ్రియాల పాఠశాలకు కంప్యూటర్,ప్రింటర్ బహుకరణ
కోదాడ,జులై 01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:జూలై 1న బ్యాంక్ డే సందర్భంగా కోదాడ ఎస్బిఐ నాలుగు బ్రాంచ్ల మేనేజర్లు కలిసి జడ్పిహెచ్ఎస్ గొండ్రియాల పాఠశాలకు కంప్యూటర్,ప్రింటర్ ని బహుకరించారు.అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.అనంతరం మేనేజర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు అందే సహాయం మాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.ఇట్టి అవకాశం ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సమాజం లో మంచిగా స్థిరపడాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్లు సందీప్ కుమార్,వీరస్వామి,మౌనిక,లాల్ పటేల్,పాఠశాల హెచ్ఎం తల్లాడ శ్రీనివాసరావు,ఏఏపీసి కమిటీ చైర్మన్ జిల్లా అరుణ,పాఠశాల దాత వంకాయలపాటి రమేష్,పాఠశాల ఉపాధ్యాయ బృందం అశోక్ రెడ్డి,లక్ష్మీనరసయ్య,ఉపేందర్ విజయ్ కుమార్,వెంకటరత్నం, వేణు,ఎల్లయ్య, శ్రీధర్,నాగేశ్వరరావు,రజిని తదితరులు పాల్గొన్నారు.