బ్యాంక్ వద్ద రెక్కి నిర్వహించి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు
Mbmtelugunews//కామారెడ్డి జిల్లా,అక్టోబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):బాన్సువాడ లొ బ్యాంక్ వద్ద రెక్కి నిర్వహించి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు.బాన్సువాడ కొఆటగల్లి కి చెందిన సమీయొద్దీన్ అనె వ్యక్తి ఇంటి ఖర్చుల నిమిత్తం కెనరా బ్యాంక్ లో లక్ష రూపాయాలు డ్రా చేసి బైక్ ముందు జేబులో పెట్టి పాల షాపులో పాలు తీసుకోవడానికి వెళ్ళాడు.అది గమనించిన ఇద్దరు దుండగుల్లో ఓ వ్యక్తి సమీయొద్దిన్ ప్రక్కకు వచ్చి పాలు లీటరు కు ఎంత అని అడిగాడు ఇంకో వ్యక్తి జేబులో నుంచి డబ్బులు తీసుకుని సైర చేయగా వెల్లి వాళ్ళు తెచ్చిన బైక్ పై పరారయ్యాడు.సమియొద్దీన్ పాలు తీసుకుని బైక్ జేబులో పెట్ట పోయే సరికి డబ్బులు కనిపించక పోవడంతో డబ్బులు పోయినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేశాడు.సీసీ ఫుట్టేజ్ ఆధారంగా పోలీసులు దుండగులను వెతుకుతున్నారు.



