భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు
Mbmtelugunews//కోదాడ,మార్చి 23(ప్రతినిధి మాతంగి సురేష్):కొమరబండ గ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 94 వ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి వారికి నివాళ్లు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యువ కిశోరాలు భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ లని అన్నారు.వారి త్యాగం ఉన్నతమైనదని దేశ చరిత్రలో చెరిగిపోనిదని యువతకు ఆదర్శప్రాయమైనదని తెలియజేశారు.స్వౌతంత్ర్యం అంటే కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదని,ఏ దోపిడీ లేని సమాజం రావాలని కోరుకున్న సమతా మూర్తి భగత్ సింగ్ అని అన్నారు.77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో వారు కలలుగన్న రాజ్యం నేటికీ కలగానే మిగిలిందని అన్నారు.దేశంలో పరిపాలన కొనసాగిస్తున్న బూర్జువ పాలకవర్గాలు సామాన్యుల పొట్టకొడుతు సంపన్నులకు దోచిపెడుతు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దోపిడీ పాలకవర్గ విధానాలపై నేటి యువత భగత్ సింగ్,రాజగురు సుఖదేవులు అందించిన స్ఫూర్తితో ఉద్యమించాలని అదే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు అనంతరామయ్య, పిడిఎస్ యు జిల్లా నాయకులు డి వేణు,మద్దెల ప్రతాప్,మద్దెల వెంకన్న,కామల్ల సైదులు,జానయ్య,సుగునమ్మ,రవి తదితరులు పాల్గొన్నారు.



