కోదాడ,మార్చి23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని కే ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అధ్యక్షత వహించగా టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామ నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు యువత తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం ప్రజలందరూ సమానత్వపు జీవితం జీవించాలని, బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులు అన్నారు. వారి స్ఫూర్తి ఈ దేశానికి అవసరం అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ పోరాట స్ఫూర్తితో యువతరం దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మతోన్మాద ఫాసిస్ట్ విధానాలకు, కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మతోన్మాద బీజేపీ ఫాసిస్టు నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. భగత్ సింగ్ అతి చిన్న వయసులోని పోరాటపటిమను అలవర్చుకొని స్వతంత్ర ఉద్యమంలో పోరాడి ఉరితాడు ముద్దాడి అమరుడయ్యాడు వారి స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ఉద్యమించాలన్నారు విద్యారంగంలో ఉన్న అనేక రకాల సమస్యలపై ఉద్యమించి సాధించుకోవాలన్నారు నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని తప్ప తగ్గే పరిస్థితి లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. *పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, కే ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాగు* మాట్లాడుతూ విద్యార్థులు స్వతంత్ర ఉద్యమం కోసం తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించిన భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్ ల చరిత్రను తెలుసుకొని వారి స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అసమాన తలపై చైతన్యవంతులై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్రావు, కే ఆర్ ఆర్ లెక్చరర్ సైదులు పాల్గొని మాట్లాడారు. కే ఆర్ ఆర్ కళాశాల ముఖద్వారంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు, పివైఎల్ నాయకులు వీరబాబు, మహేష్, నవీన్, రమ్య, రేణుక, జ్యోతి, సంధ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



