భరతనాట్యంలో 12 ప్రపంచ రికార్డులు సాధించిన నాట్య గురువు తిరుపతి స్వామి శిష్య బృందం
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 02:ఇంటర్నేషనల్ కర్నాటిక్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాశీ విశ్వనాథుడి దేవాలయం వారు,గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వారు స్వయంక ఆధ్వర్యంలో నిర్వహించిన కాశీ విశ్వనాథుడికి రావణా కృత శివతాండవ స్తోత్రానికి ప్రపంచవ్యాప్తంగా కాశీ దేవాలయం నుండి నిర్వహించిన ఆన్లైన్ లైవ్ ప్రోగ్రాం లో పాల్గొని ఈ 12 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగిందని శ్రీ తన్వి నటరాజ్ డాన్స్ స్కూల్ నిర్వాహకులు భరతనాట్యం గురు తిరుపతి స్వామి సోమవారం తెలియజేశారు.ఇందుకుగాను ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని నాట్యాన్ని ప్రదర్శించి అప్రూవల్ తెచ్చుకొని సోమవారం ప్రపంచవ్యాప్తంగా కాశి దేవాలయం నుంచి నిర్వహించిన లైవ్ కాంటెస్ట్ ఆన్లైన్లో పాల్గొని విజయవంతంగా ఈ 12 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగిందని తెలియజేశారు.ప్రపంచంలోనే ఈ 12 ప్రపంచ రికార్డులు ప్రోగ్రాం నిర్వహించడం ఇదే మొదటి సారి అని మొదటిసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో నావద్ద నేర్చుకున్న చిన్నారులు 15 మంది పాల్గొని ఇంత గొప్ప ఘనత సాధించడం ఇది ఎంతో గర్వకారణం అని తెలియజేశారు.12 ప్రపంచ రికార్డులతో పాటు కాశి విశ్వనాధుడి దేవాలయం నుండి సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సర్టిఫికెట్,పార్టిసిపేట్ సర్టిఫికెట్,వరల్డ్ రికార్డ్ మెడల్స్ సాధించడం జరిగిందని తెలిపారు.నాట్య చిన్నారులకు వరల్డ్ రికార్డు మెడల్స్ సర్టిఫికెట్స్ మెమొంటోస్ నాట్య గురువు అందజేశారు.ప్రపంచంలోనే కాశీ విశ్వనాథుడికి నాట్యం చేయడం ఇదే మొదటి సారి అని 15 మంది చిన్నారులు ఈ ఘనత సాధించారని తెలియజేశారు.12 ప్రపంచ రికార్డులు సాధించిన నాట్య చిన్నారులు 1.శ్లోక ,2.హాసిని,3.శ్రేష్ట,4.కుసుమ,5.లౌక్య,6.నిత్య,7.ఆద్య,8.సాన్వికరావు,9.డాక్టర్ శిరీష,10.తపస్య,11.థుతి,12.హృతిక,13.జెనీల,14.యువాన్స,15.సాన్వికలు.ఈ కార్యక్రమంలో నాట్య చిన్నారులు తోపాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని ఇది కోదాడ పట్టణానికి ఎంతో గర్వకారణమని నాట్యగురు తిరుపతి స్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు.