Saturday, January 24, 2026
[t4b-ticker]

భరతనాట్యానికి చేసిన కృషికి గాను నాట్యగురు తిరుపతిస్వామికి ‘సేవారత్న’ 2026 పురస్కారం .

భరతనాట్యానికి చేసిన కృషికి గాను నాట్యగురు తిరుపతిస్వామికి ‘సేవారత్న’ 2026 పురస్కారం .

Mbmtelugunews//కోదాడ, జనవరి 12(ప్రతినిధి మాతంగి సురేష్): అంతర్జాతీయ కర్నాటిక్ సంగీతం అండ్ డ్యాన్స్ అసోసియేషన్, గొప్ప ప్రతిష్టతో, శాస్త్రీయ రంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, ఈసారి ఈ అవార్డుకు నాట్యగురు తిరుపతిస్వామిని ఎంపిక చేసింది.
తిరుపతిస్వామి మార్గదర్శకత్వంలో శ్రీ తన్వి నటరాజ్ నృత్య పాఠశాల నిర్వహణ ద్వారా, భరతనాట్యంలో ఇప్పటివరకు పద్దెనిమిది ప్రపంచ రికార్డులు సాధించారు, పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ రికార్డులను సాధించారు. 

ప్రపంచ కార్యక్రమాల ద్వారా శాస్త్రీయ కళలను ప్రోత్సహించడంలో అంకితభావంతో కూడిన సేవ, సాంస్కృతిక నాయకత్వం,తిరుగులేని మద్దతుకు గుర్తింపుగా తిరుపతిస్వామి భరతనాట్యానికి చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
ఈ అంతర్జాతీయ అవార్డు మన నాట్యగురువు తిరుపతిస్వామికి రావడం పట్ల నృత్య విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular