భారతీయ సమైక్యత స్ఫూర్తి దాత సర్దార్ వల్లభాయ్ పటేల్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్): గణతంత్ర భారత పునాదులను నిర్మించి తీర్చిదిద్దిన వ్యక్తులలో దృఢచిత్రుడు ఉక్కు నిర్ణయాలతో ఉక్కుమనిషిగా ఖ్యాతి పొందిన ఏకైక సమరయోధుడు డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఏటా అక్టోబర్ 31న జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నాం. 1947 అనంతరం 560 పైగా సంస్థానాలను ఏకతాటిపై తెచ్చి ఒక రాజకీయ గొడగు కింద విలీనం చేశాడు. ఈ నిర్ణయాలే భారత ఉపఖండం విచ్చినం కాకుండా కాపాడింది. ఆయనే లేకపోతే జునాగడ్ ,హైదరాబాద్ ,జమ్మూకాశ్మీర్ అనిశ్చి తిలోకి జారిపోయేవి.పటేల్ దేశ నిర్మాణ పరంపరను చిరస్మరణీయం చేసేలా నెలకొల్పిన 152 మీటర్ల ఎత్తైన ఐక్యత మూర్తి అంటే (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) అంటారు .కావున సర్దార్ స్ఫూర్తి వికసితభారత్ సమైక్యతే భారతీయ జీవనధర్మం అని పాఠశాలలో కొంతమంది వక్తలు ప్రసంగించారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని స్థానిక తేజ టాలెంట్ స్కూల్లో సమైక్యతకు స్వరూపమైన సర్దార్ గురించి మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కలిగించారు. దీనిలో భాగంగా పాఠశాలలో వ్యాసరచన పోటీలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి యు అంజలి,ద్వితీయ బహుమతి జి ప్రవళిక,తృతీయ బహుమతి సిహెచ్ వర్షిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రెటరీ సంతోష్, కుమార్ ప్రిన్సిపల్ సోమా నాయక్, ఇంచార్జ్ రామమూర్తి, రేణుక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



