భారత్ ఖాతాలో మూడో పతకం
Mbmtelugunews//పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది.మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకం సాధించింది.14.21 సెకన్లలో రేసును ముగించి వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు సాధించింది.కాగా,పారాలింపిక్స్-2024లో భారత్కు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇదే తొలి పతకం.ఉమెన్స్ 100 మీటర్ల టీ35 రేసులో చైనా అథ్లెట్లు స్వర్ణం,రజతం సాధించారు.రేసును 13.58 సెకన్లలో ముగించిన జియా జౌ స్వర్ణం సాధించింది.13.74 సెకన్లలో పరుగును పూర్తి చేసిన గౌ సిల్వర్ మెడల్ దక్కించుకుంది.అంతకుముందు ఇవాల జరిగిన షూటింగ్ లో భారత్ ఏకంగా రెండు పతకాలతో సత్తా చాటిన విషయం తెలిసిందే.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ట్రెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది.