కోదాడ,జూన్ 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు అని బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బొల్లం కళ్యాణ్ అన్నారు.బుధవారం మాజీ ప్రధాని, తెలుగుజాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించినారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాని పగ్గాలు చేపట్టి దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలతో గట్టెక్కించిన మహనీయుడని పివి అని ఆయన అన్నారు.ఆ మహనీయుని జయంతిని ఘనంగా జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ఈ దేశానికి అందించిన సేవలను దేశ ప్రజలందరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు.తెలంగాణ బిడ్డగా వారు దేశానికి అందించిన సేవలను మరువలేనివి అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ గారు మాజీ ప్రధాని నరసింహారావుని గౌరవించుకుంటూ వారు శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు.వారి కుమార్తె వాణిదేవికి పట్టభద్రులు అవకాశం ఇచ్చి గెలిపించినారు అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు,బిఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, పట్టణ కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ,డాక్టర్ బ్రహ్మం, మైస రమేష్,అపర్ణ వెంకట్, బిఆర్ఎస్ నాయకులు పోటు రంగారావు,సంపేట ఉపేందర్ గౌడ్, బత్తుల ఉపేందర్,ముస్తఫా, మేకపోతుల సత్యనారాయణ,మాదాల ఉపేందర్,తమలపాకుల లక్ష్మీనారాయణ,విద్యార్థి నాయకుడు వంశీ,తరుణ్,తదితరులు పాల్గొన్నారు.
భారత ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు:బొల్లం కళ్యాణ్
RELATED ARTICLES