భారత క్రికెట్ జట్టుకు తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థుల శుభాకాంక్షలు
Mbmtelugunews//కోదాడ, మర్చి 07(ప్రతినిధి మాతంగి సురేష్ ): రేపు జరగబోయే భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తేజ టాలెంట్ స్కూల్, కోదాడ విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టు ఈ కీలక పోటీలో విజయం సాధించి దేశానికి గౌరవం తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు భారత జట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తూ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లు ధైర్యంగా ఆడి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, సెక్రటరీ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని భారత జట్టుకు తమ ఆశీస్సులు అందజేశారు. దేశ గౌరవాన్ని మరింత పెంచేలా భారత జట్టు విజయంతో తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు.



