కోదాడ,నవంబర్ 12(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత చైతన్య యువజన పార్టీ మేనిఫెస్టో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రజలు యువకులు పార్టీలు చేరుతున్నారని భారత చైతన్య యువజన పార్టీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అబ్దుల్ మాలిక్ అన్నారు.ఆదివారము కోదాడ నియోజకవర్గంలో పలు మండలాలలో భారీ చేరికలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అబ్దుల్ మాలిక్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ మండలంలో మరియు అనంతగిరి మండలంలో బీసీవై పార్టీ కి ఆకర్షితులై భారీగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.

ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడలో బీసీవై జెండా ఎగరవేసి పార్టీ అధ్యక్షులకు కానుకగా ఇస్తామని అన్నారు. బీసీవై మేనిఫెస్టో,బిసివై సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గద్దె నరేందర్,పార్టీలో జాయిన్ అయినవారు కోదాడ మండల పరిధిలో షరీఫ్,ఇమ్రాన్,రఫీ,పున్ని,షేక్ హస్సాన్,హారీఫ్,అనంతగిరి మండలం పరిధిలో వెంకటేశ్వర్లు,మల్లికార్జున్ తదితరులు పార్టీలో చేరినారు.



