Saturday, July 5, 2025
[t4b-ticker]

భారత పశుసంపద పోర్టల్ లో గొర్రెలు,మేకలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి:డా, పి పెంటయ్య

భారత పశుసంపద పోర్టల్ లో గొర్రెలు,మేకలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి:డా, పి పెంటయ్య

Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 21:మున్సిపాలిటీ పరిధిలో గొర్రెలు,మేకలు రిజిస్ట్రేషన్,అఖిల భారత పశుసంపద పోర్టల్ (భారత్ పశుదాన్ పోర్టల్ )లో నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజా ఆహారంగా వినియోగించే గొర్రెలు,మేకలు,పందులు వాస్తవ సంఖ్య గుర్తింపు,కాలానుగుణంగా ఇవ్వాల్సిన నత్తల నివారణ మందులు,సీజనల్ జబ్బులకు వేయాల్సిన టీకాలను భారత్ పశుదాన్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ జాతీయ స్థాయిలో పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.నూటికి 98.7 శాతం ప్రజలు పశువుల ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునే మనదేశంలో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం అందేలా పశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ పోర్టల్ ఊయోగపడుతుందన్నారు.దీనికోసం ముందుగా గొర్రెలు,మేకలు ఉన్న రైతుల వివరాలు పోర్టల్ లో నమోదు చేసి తమ మందలో ఒక గొర్రెకు లేదా పొట్టేలుకు ఆధార్ నెంబర్ లాగా 12 అంకెలు గల నెంబర్ చెవి పోగు వేసి గొర్రెల మందతో కలిపి యజమాని ఫోటో తీసి పోర్టల్ అంతర్జాలంలో అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది.తద్వారా అట్టి జీవాల మాంసం కోసం ఉపయోగించే క్రమములో యజమాని పేరు పోర్టల్ లో చూడడం ద్వారా ఆ జీవానికి వేయాల్సిన అన్ని రకాల టీకాలు మందులు వేసినది లేనిది గుర్తించవచ్చు.అలా గుర్తించిన జీవాల మాంసాన్ని నిస్సంకోశంగా వాడుకొచ్చు ఇలా మొత్తం మున్సిపాలిటీ పరిధిలోని గొర్రెలు మేకలకు గుర్తింపు నంబర్లతో యజమానులతో సహా భారత్ పశుదాన్ పోర్టల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.తద్వారా ఇక్కడి జీవాల ఆరోగ్యస్థితి సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది.ఎవరైనా జీవాల పెంపకం ల్దారులు తమ జీవాల రిజిస్ట్రేషన్ చేయించడం మిస్ అయితే అలాంటి వారు ప్రాంతీయపశువైద్యశాలలో సంప్రదిస్తే వారి ఇంటివద్దనే రిజిస్ట్రేషన్ చేయబడునని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సన్నజీవాల పోషకులకు తెలియజేస్తున్నామన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular