భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలి….
Mbmtelugunews// గరిడేపల్లి, డిసెంబర్06( ప్రతినిధి మాతంగి సురేష్):భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అంబేద్కర్ యూత్ సభ్యులు అన్నారు.బి ఆర్ అంబేద్కర్ 70 వ వర్ధంతి పురస్కరించుకొని శనివారం పొనుగోడు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ న్యాయం తో పాటు అందరికీ విద్యా, ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు మన అందించి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేసిన గొప్ప న్యాయ శాస్త్రవేత్త అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన గాదె రవిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా అంబేద్కర్ యూత్ తరపున కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



