భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు నడవాలి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 26(ప్రతినిధి మాతంగి సురేష్):భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అభివృద్ధిలో ముందుకు నడవాలని కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (ఏ) ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు అన్నారు.కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం,ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజులు శ్రమించి ఉత్తమమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.ప్రపంచ దేశాల్లో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగమే అన్నారు.రాజ్యాంగ విలువలు,ఆశయాలను తెలుసుకొని వాటిని పాటిస్తూ విద్యార్థులందరూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ జి సైదులు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మల కుమారి,రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకులు ఎన్ సైదమ్మ,ఎస్ఎం రఫీ,జిఎల్ఎన్ రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.