భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 14 (ప్రతినిది మాతంగి సురేష్): కోదాడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ముప్పుకు గురి అయిన పరివాహక ప్రాంతాలను కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి గురువారం మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖమ్మం రహదారిపై ఉన్న తమ్మరవాగు ప్రవాహాన్ని పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే వాగు పరివాహక ప్రాంతం పక్కనే ఉన్న శిరిడి సాయి నగర్ ను వరద ముప్పకు గురైన గృహాలను ఆమె పరిశీలించి గృహ యజమానులను పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంత వాసులకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ అధికారులను, రెవెన్యూ అధికారులను కోరారు. ముంపుకు గురైన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎవరైనా నీళ్లలో చిక్కుకుంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణ సహాయం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ నాయకులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



