భార్యను చంపి భర్త ఆత్మహత్య
సిరిసిల్ల,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కు చెందిన దూస రాజేశం-లక్ష్మి ఇద్దరు దంపతులకు ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్దకొడుకు,కుమార్తెలకు వివాహం కాగా చిన్న కుమారుడు హైదారాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు.కాగా కొద్దిరోజుల నుండి రాజేశం రెండు కిడ్నీలు పాడై కిడ్నీ సంబడిందిత వ్యాధితో బాధపడుతున్నాడు.బోనాల పండుగ నేపథ్యంలో పెద్దకొడుకు ఆదివారం అత్తవారింటికి వెళ్ళాడు.తన డయాలసిస్ వైద్యానికి భార్య లక్ష్మి డబ్బులు ఇవ్వడం లేదని మనసులో పెట్టుకున్న రాజేశం రాత్రి భార్య లక్ష్మిని చంపి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.