భాష్యం వంశీ మరణం వారి కుటుంబానికి తీరనిలోటు:డా,,అంజి యాదవ్
చిలుకూరు,జూన్ 06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని పాత కొండాపురం గ్రామంలో ఇటీవల మరణించిన భాష్యం వంశీ కుటుంబాన్ని పరామర్శించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్.అనంతరం మృతుని తండ్రి సోమయ్య నీ పరామర్శించి ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించిన డా,,అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశి ప్రజా ఉద్యమాలలో ఎంతో చురుకుగా పాల్గొనే వాడని ఎప్పుడు విద్యార్థుల కోసం పోరాడేవాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.వంశీ మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని వారి కుటుంబా ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట సుధాకర్,పచ్చిపాల రామకృష్ణ,రాజశేఖర్,వెంకన్న మల్లేష్,నవీను తదితరులు పాల్గొన్నారు.



